Divi Vadthya New Vacation Photoshoot ,దివి వైద్య భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి మరియు మోడల్. ఆమె 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. దివి బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది.ఆమెను హైదరాబాద్ టైమ్స్ 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా ప్రకటించింది.
దివి వైద్య 15 మార్చ్ 1996లో హైదరాబాద్ లో శశికాంత్ వైద్య, దేవకీ దంపతులకు జన్మించింది. ఆమె పదవ తరగతి వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో చదివింది. జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది.
దివి సినిమాల మీద మక్కువతో 2017లో మోడలింగ్‌తో తన కెరీర్ మొదలు పెట్టింది. ఆమె పలు ఫాషన్ సంస్థలకు మోడలింగ్ చేసింది. దివి 2018లో తొలిసారిగా “లెట్స్ గో” అనే లఘు చిత్రంలో నటించింది. ఆమె 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. దివి 2019లో ఏ 1 ఎక్స్‌ప్రెస్ , 2021లో క్యాబ్ స్టోరీస్ చిత్రాలలో నటించింది.ఆమె నటించిన ‘సిలక ముక్కుదానా’ అనే మ్యూజిక్ వీడియో 3 జులై 2021న విడుదలైంది